online marketing

Tuesday, March 13, 2012

కోవూరు ఉప ఎన్నిక కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా


కోవూరు : కోవూరు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలైన ఆనం వేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అధిష్టానం ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క మండలం కేటాయించడంతో వారి వారి ప్రాంతాల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి మెజారిటీ తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన పర్యటిస్తున్నారు. అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కోవూరు ఉప ఎన్నిక కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అక్కడ అభ్యర్థుల మధ్య నువ్వా...నేనా అన్నట్లుగా హోరా హోరీగా ఉంది. ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తమే కాకుండా జిల్లాలో కూడా ఉత్కంఠత నెలకొంది. ఎక్కడ చూచినా ఈ ఉప ఎన్నికపైనే చర్చ సాగుతోంది. ఒక వైపు రహస్య బెట్టింగ్‌లు కూడా సాగుతున్నట్లు సమాచారం. కోవూరు ఉప ఎన్నిక ప్రచారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించి బహిరంగసభ సైతం నిర్వహించారు. అలాగే రెండు రోజుల నుంచి చిరంజీవి రోడ్‌ షో నిర్వహిస్తుండగా పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిమిత్తం రావడం జరిగింది.


అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు సైతం కోవూరు ఎన్నిక కోసం రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా ఈ ఎన్నికల్లో భాగంగా నార్తురాజుపాళానికి రావడం జరిగింది. ఈ విధంగా అగ్రనాయకులకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావ డంతో ముఖ్యమంత్రి సూచన మేరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన ఆనం వివేకా, ముంగమూరు, ఆదాల, ఎమ్మెల్సీ వాకాటిలు ఈ  ఎన్నిక ల్లో వారి వారి ప్రాంతంలో మెజారిటీ కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డికి వచ్చే విధంగా వారి వారి రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh