online marketing

Sunday, February 12, 2012

లోకకళ్యాణార్ధం శ్రీ లక్ష్మీనరసింహ మహాయాగం 36 హోమకుండలములతో..

రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రం.రాపూరు పెంచలకోన లో స్వయంభువుగా వెలసివున్న భక్తుల ఇలవేల్పు ఆరాద్యదైవంగా వెలుగొందుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్ధానం నందు ఆదివారం లోకకళ్యాణార్ధం శ్రీ లక్ష్మీనరసింహ మహాయాగం 36 హోమకుండలములతో అత్యంతవైభవంగా జరిగింది.

స్వస్తిశ్రీ చాంద్రమానేన వికృతనామ సంవత్సర మాఘబహుళ చవితి శనివారం రోజు ప్రారంభమైన మహాయాగం శ్రీశ్రీ త్రిదండి వానమామలై శతగోపరామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీనరసింహ మహాయాగం పూర్మాహుతి గావించుకొనిరి.

శ్రీవారి క్షేత్రం నందు 36 కుండలములతో శ్రీ లక్ష్మీనరసింహయాగంలో ఆదివారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం మహాకుంభస్థాపన, హోమకుండ సంస్కారములు చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, శ్రీపెనుల నరసింహ మూలమంత్ర జపము, విశేషహోమం, నివేదన, శాత్తుమొఱ్తె, తీర్ధప్రసాదాలఘోష్టి జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చతుస్తానార్చన, శ్రీ లక్ష్మీనరసింహ మూలమంత్ర జపములు, హవనము, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మహాకుంభ సంప్రోష్టన విశేష ఆరాధన, నివేదన, శాస్తుమొఱ్తె, తీర్ధప్రసాదాలు ఘోష్టి, మహదాశ్వీరాదం కార్యక్రమాలు అత్యంతవైభవంగా జీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహాహోమానికి నెల్లూరు జిల్లాలోని భక్తులేకాకుండా కడపజిల్లాలోని భక్తులు మరియు చెనై్న నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ నెల్లూరు రవీంద్రారెడ్డి, సహాయక కమీషనర్‌ శనగవరపు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh