online marketing

Wednesday, February 15, 2012

రాపూరు లక్ష్మీపురంలో సమస్యలు కోకొల్లలు...

రాపూరు :  రాపూరు లక్ష్మీపురంలో సమస్యలు కోకొల్లలుగా వున్నాయి. వర్షం వస్తే వారి తిప్పలు చెప్పనలవి కావు. దీంతో నిత్యం అవస్థ పడుతూనే వున్నారు. ఏళ్లనాటి నుంచి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రోడ్లు వరద నీటిలో మునుగుతున్నాయి. అన్నింటికి మించి కోట అగర్త కలుజు ప్రవహిస్తే ఆ నీరంతా కాలనీని చుట్టుముడుతుంది. భారీ భవనాలు జలదిగ్భంధంలో చిక్కుకుంటాయి. పాములు, విష పురుగులతో భయానకమైన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇక్కడ రెండో వీధి ఏర్పాటుకు స్థలం కేటాయించారు.

 రాపూరు గూడూరు మొయిన్ రోడ్డు నుంచి రెండో వీధి కోసం లే అవుట్‌లో దారి ఏర్పాటుచేసినట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. రాత్రయితే ఇళ్లలోనించి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. చినుకు పడితే కాలనీ దర్గంధం వెదజల్లుతుందని, అంటురోగాలు ప్రభలుతున్నాయన్నారు. అయితే ఆ రెండో వీధి మొయిన్‌లో దారికి అడ్డంగా బేస్‌కట్టి దారి లేకుండా చేసారంటూ వారు వాపోతున్నారు. దీంతోనే వర్షపు నీరంతా కాలనీని చుట్టుముడుతున్నట్లు వారు వాపోతున్నారు. ఎన్నిమార్లు బేస్‌మెంట్ తీసివేయాలని కోరినా తీయడం లేదంటున్నారు.  ఇప్పటికైనా పాలకులు పట్టించుకోవాలని న్యాయం చేయాలన్నారు. ఈ విషయమై ఇప్పటికే తహసిీల్దారును కలసి వినతిపత్రం సమర్పించామన్నారు. న్యాయం కోసం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. సమస్యలు పరిష్కరింకుంటే ఆందోళన చేస్తామన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh