తడ, మేజర్ న్యూస్ : తమిళనాడు, ఆంధ్ర రాష్ర్త సరిహద్దులో జాతీయ రహదారి పక్కనే ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంక్‌లోకి చొరబడి మారణాయుధాలతో దాడిచేసి ఒకరిని చంపి, మరొకరిని తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వ్యక్తి రక్తస్రావం ఎక్కువ కావడంతో 108 వాహనంలో వెంటనే చెనై్న జిహెచ్‌కు తరలించారు. తడ మండలం సరిహద్దు గ్రామమైన పెరియవట్టు సమీపంలో ఎస్‌కెఎల్‌ఎస్‌కు చెందిన భారత్ పెట్రోల్ బంక్‌లో డ్యూటీ పూర్తి చేసుకొని ఆఫీసు రూంలో నిద్రిస్తున్న పంపుమెన్ మునిశేఖర్ (31)ను కిరాతకంగా మెడపై నరికి చంపారు. పక్కనే ఉన్న క్యాషియర్ జె. ఆరోగ్య రాజును చంపేందుకు దుండగులు ప్రయత్నించి అతని కుడిచేతిపై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఆర్తనాధాలతో మేనేజర్ రూంలో నిద్రిస్తున్న మరో ఇద్దరు సిబ్బంది అలికిడితో దుండగులు పరారైనారు. సేకరించిన సమాచార ంమేరకు దొరవారిస్రతం బేరిజంగాల పల్లి గ్రామానికి చెందిన ఇరకం మునిశేఖర్‌కు చిట్టమూరు మండలం కుమ్మరపాళెంకు చెందిన భారతితో వ7సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలుకూడా ఉన్నారు. పిల్లల చదువు నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం సూళ్ళూరుపేట సాయినగర్‌లో మృతుడు నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకొనేందుకు వికలాంగుడైన మునిశేఖర్‌కు వీలుకాకపోవడంతో తనకున్న భూమిని కౌలుకు ఇచ్చి పెరియవట్ట పెట్రోల్ బంక్‌లో ఏడాదిగా పంప్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీలో మృతుడితోపాటు మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు.తెల్లవారుజామున బంక్‌లోకి ఎవ్వరూ రాకపోవడంతో ఇద్దరు బయట నిద్రపోతుండగా నగదు ఉన్న ఆఫీసురూంలో మరో ఇద్దరు నిద్రలో జోగుతున్నారు. యథావిధిగా బంక్‌లో రాత్రి వేళలందు పార్క్‌చేనే వాహనాలు, బస్సులు వెళ్లిన తర్వాత ఈ పరిమాణం చోటుచేసుకోవడంతో అసలు ఏం జరిగిందో ఎవ్వరికి అర్ధంకాలేదు. పనిచేస్తున్న సిబ్బంది పేరయ్య కథనం మేరకు 5గంటల ప్రాంతంలో బాధితుల కేకలతో నిద్రలేచినట్లు పేర్కొన్నారు. మా అలికిడిని గుర్తించిన దుండగులు బంక్ వెలుపలకి పరుగులు తీసినట్లు తెలిపారు. కాని అప్పటికే వికలాంగుడైన మునిశేఖర్ దారుణంగా మృతిచెందడం, మరో వ్యక్తి రక్తపుమడుగులో పడివుండటం షాక్‌కు గురైనట్లు పేరయ్య తెలిపారు. అదే సమయంలో విధి నిర్వహణలో చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ హరికృష్ణ హుటాహుటిన సిబ్బందితో బంక్ వద్దకు చేరుకొని క్షతగాత్రుడిని 108సహాయంతో చెనై్నకు త రలించారు.
సంఘటనపై ఎన్నో అనుమానాలుజిల్లాలో పెట్రోల్ బంక్‌లపై దాడులుచేసి నగదు కోసం సిబ్బందిని అతి దారుణంగా చంపడం, గాయాలకు గురిచేయడం నానాటికి ఎక్కువవుతున్నాయి. భారత్ పెట్రోల్ బంక్‌లో కూడా పాత పద్ధతిలోనే దుండగులు బీభత్సం సృష్టించడంతో ప్రజలు భయాందోళనలకు గురవునారు. జరిగిన ఘటనపై పోలీసులు జిల్లా క్లూస్‌టీం సహాయంతో వేలిముద్రలను సేకరించి, విజయవాడ నుండి పోలీసు జాగిలాన్ని రప్పించారు. రెండు సంవత్సరాల క్రితం తడ నుంచి సూళ్ళూరుపేట వైపుకు మోటారుబైకుపై వెళ్లుతున్న ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి నగదును అపహరించి ఉండ డంతో, జరిగిన సంఘటన గుర్తుతెలియని తమిళ వ్యక్తుల దుశ్చర్యగా భావించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూళ్ళూరుపేట సిఐ వంగా సుబ్బారెడ్డి సంఘటనా స్ధలానికి చేరుకొని అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. బంధువుల సమాచారంతో మృతుడుపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు, కక్షలు ఏమి లేనన్నట్లుగా తేలడంతో నగదు కోసమే దుండగులు ఇంత దారుణానికి పాల్పొడినట్లు పేర్కొన్నారు. వ్యవహారంపై ప్రత్యేక ఐడి పార్టీ ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment