పొదలకూరు,మేజర్‌న్యూస్: కోత, కోత, కోత ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో కోతలే. ప్రభుత్వం విధిస్తున్న కోతలు ప్రజల పాలిట‘వాత’లవుతున్నాయి. బహిరంగమార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశ్శానంటి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోత విధిస్తుండటంతో పేదవర్గాల్లో గుబులు పట్టుకోంది. సంసారాన్ని ఎలా నెట్టుకురావాలనే ఆందోళనలతో సగటుమనిషి తలపట్టుకొన్నాడు. చౌకదుకాణాల ద్వారా ఇచ్చే కిరోసిన్, చక్కెరలో కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో రేపు బియ్యం పంపిణీలో కూడా కోత విధిస్తారేమోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండల కేంద్రాల్లో 2 లీటర్లు వంతున. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లీటరు వంతున కిరోసిన్ పంపిణీలో కోతవిధించారు.అలాగే ప్రస్తుతం ఒక కిలో చక్కెర ఇస్తుండగా దాన్ని అరకిలోకు కుదించారు. ఖజానాలోటును పూడ్చేందుకు పేదల నెత్తిన భారం వేస్తూ వారి బతుకులను ఛిద్రం చేయడం కడుశోచనీయమని మేధావివర్గాలు ఆరోపిస్తున్నాయి. బోగస్‌కార్డుల ఏరివేతతో ప్రభుత్వానికి ఎంతో ధనం ఆదా అయిందని, అయినప్పటికీ ఇచ్చే సరుకుల్లో కోత విధించడం సమంజసం కాదని వారు పేర్కొంటున్నారు. వైఎస్ తన పాలనలో పేదలకు ఎలాంటి లోటురాకుండా చూసేవారని, పేదల పథకాల్లో కోత పెట్టేవాడు కాదని, ఇప్పటి ప్రభుత్వంలో అన్నీ బాధలే కలుగుతున్నాయని పేదతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలకు గంజినీళ్ళు దొకడం కూడా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్‌దుకాణాల్లో సరుకుల కోతలపై వినియోగదారుల అభిప్రాయాలు
ఇదేం! ప్రభుత్వంరా దేవుడా?రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వం ఉందో లేదో అర్ధం కావడం లేదు. అన్నీ ధరలు పెరిగిపోయాయి. పేదలకోసం కొత్త పథకాలు పెట్టకపోతే పోయె...ఉన్న వాటిలో కూడా కోత విధస్తే ఎట్టా...
ఇక మూడుపూటలా తిండికరవే!ప్రభుత్వ పాలకులు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే పేదోళ్ళకు మూడుపూటలా తిండిదొరకడం కష్టమేననిపిస్తుంది. కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కావడం లేదు.
చక్కెర చూసి లొట్ట వేయాల్సిందే...బజారులో చక్కెర ధర చుక్కలనంటుతోంది. చౌకదుకాణాల్లో అంతకంతకూ కోత పెట్టేస్తున్నారు. రాబోయే రోజుల్లో చెక్కర చూసి లొట్ట వేయాల్సిందే...తినే పరిస్థితి ఉండదు.
వంట ఎలా వండుకోవాలోకట్టెలు కొనలేం, వంటగ్యాస్‌కు డిమాండ్.. బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. చౌకడిపోద్వారా అందే కిరోసిన్‌తో ఎలాగోలా సర్దుకుంటూ వంటచేసుకునే వాళ్ళం. ఇప్పుడు దీంట్లోనూ కోత పెట్టారు. ఎలా వంట చేసుకోవాల్లో అర్ధం కావడం లేదు.
No comments:
Post a Comment