Sunday, January 17, 2010
డి ఆర్‌కు కన్నీటి వీడ్కోలు
కావలి రూరల్, మేజర్‌న్యూస్: గత 60సంవత్సరాల క్రితం ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మంది బడుగుల కుటుంబాలలో వెలుగులు నింపిన దొడ్ల రామచంద్రారెడ్డికి ప్రజలు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని మానస థియేటర్ వద్దనున్న ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు మాగుంట పార్వతమ్మ, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, జెబి కళాశాల పూర్వ విద్యార్థులైన ఎన్‌ఆర్‌ఐలతోపాటు పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. డిఆర్ నివాసం నుంచి భౌతికాయంతో ర్యాలీగా వెళ్లి హిందూ స్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యా దాత డిఆర్ లేని లోటు కావలిలో కనిపిస్తుందని తెలిపారు. ఆయన మరణం పలు జిల్లా వాసులకు తీరని లోటని స్పష్టం చేశారు. ఆయన నెలకొల్పిన విద్యా సంస్థల్లో ఎందరో విద్యనభ్యసించి ఉన్నత వ్యక్తులుగా ఎదిగారని పేర్కొన్నారు. విదేశాలలో కూడా జవహర్ భారతి విద్యా సంస్థ ప్రతిష్టను ఇనుమడింప చేసిన కీర్తి అక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులకే దక్కుతుందని చెప్పారు.విద్య పట్ల డిఆర్‌కున్న నమ్మకమే ఎందరో మహానుభావులకు వెలుగునిచ్చిందని తెలిపారు. జవహర్ భారతి రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలిగారని చెప్పారు. సుందర వాతావరణంలో జవహర్ భారతి నిర్మించారని ఆ తల్లి ఒడిలోనే తాము ఇంతటి వారమయ్యామని పలువురు ఎన్‌ఆర్‌ఐలు గుర్తు చేసుకున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తులము తాము కావడం వెనుక డిఆర్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి జూపూడి ప్రభాకర్, నేదురుమల్లి పద్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాస కిరణ్, సిపిఐ జిల్లా నేత జక్కా వెంకయ్య, పిఆర్‌పి నేత రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, విరసం నాయకులు కళ్యాణరావు, యానాదిశెట్టి, మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment