Friday, January 22, 2010
దగ పడుతున్న రైతన్న
తడ, మేజర్ న్యూస్ : రైతుల అవసరాలను దృష్టిల ఉంచుకొని ఎరువుల డీలర్లు నిర్ణీత ధరల కంటే అధికరలతో అమ్ముతూ రైతన్నలను పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన అధికారులు డీలర్లతో కుమ్ముకై్క చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అధిక ధరల విక్రయంపై రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం శూన్యం. దీంతో నిస్సహాయస్ధితిలో రైతులు డీలర్లు నియమించినే ధరలకే ఎరువులను కొనుగోలు చేస్తూ ఏం చేయలేక మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. ఏం మాట్లాడితే ఉన్న ఎరువులు దక్కవేమో అన్న మీమాంసలో రైతులు నిమ్మకుండిపోతున్నారు.మేజర్‌న్యూస్ సేకరించిన సమాచారం మేరకు రైతంటే అందరికి చులకనే. ముఖ్యంగా వ్యాపారులకైతే మరీను. అసలే సకాలంలో రావాల్సిన వానలు ఆలస్యంగా రావడంతో దిగాలు చెందిన రైతన్న చాలీచాలని దిగుబడితో వరి పంట గట్టెక్కితే చాలన్న రీతిలో ఈ ఏడాది సాగుకు సిద్దమయ్యాడు. పంటలకు కావలసిన ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం రైతుల అవసరాల మేరకు సరఫరా చేసేవిధంగా ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరడైనా పట్టుకోలేడన్న సామెతెను రుజువు చేస్తూ వ్యవసాయాధికారులు డీలర్ల ఇచ్చే సొమ్ముకు ఆశపడి రైతులను నిలువునా దోచేస్తున్నారు. బాబోయ్.. సూళ్ళూరుపేట డివిజన్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్‌పి ధరలకంటే అధికధరలతో అమ్ముతున్నారని రైతులు లబోదిబోమంటున్న వారి గోడును పట్టించుకొనే అధికారులే కరవైనారు.సూళ్ళూరుపేట సబ్ డివిజన్ పరిధిలో తడ, సూళ్ళూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో సుమారు 32మంది ఎరువులు, పురుగుమందుల డీలర్లు ఉన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బోర్డులను ఏర్పాటుచేసి తగిన బిల్లులతో ఎరువులను విక్రయిస్తున్నారు. కాని ప్రైవేట్ డీలర్ల వద్ద బోర్డులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు బిల్లులు ఉండవు, ఉన్నా అవి రైతులకు కనపడకుండా వారిని మోసంచేస్తున్నారు. పరిధిలో 15వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉండగా, సీజన్ పంటగా 13వేల ఎకరాలను వరి సాగు చేస్తున్నారు. ఇందులో వేరుశనగ 3వందల ఎకరాలును రైతులు పంట పండించేందుకు సిద్ధమైనారు. ఇప్పటివరకు వేసిన పంట దిగుబడులకు ఎరువుల టన్నుల రూపంలో యూరియా 5వేల అయిదు వందలు, సూపర్ ఫాస్పేట్ 11వేలు, పొటాష్ 11వేల 5వందల టన్నులు అవసరం ఉంది. ఇందులో 18వందల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అవసరం పడుతుంది. ఇదే అదను చూసుకొన్న డీలర్లు అధికారులతో ఒప్పందం కుదుర్చొకొని రైతులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువులైన 20:20 బస్తాకు 70రూ. నుండి రూ. 90, 28 : 28 బస్తాకు రూ. 60, డిఏపి బస్తాకు రూ.60 నుంచి రూ.100, సూపర్ ఫాస్పేట్ బస్తాకు రూ. 40, యూరియా బస్తాకు 20చొప్పున అధిక ధరలతో రైతులకు అంటగడుతున్నారు. ఎవరైనా రైతులు బిల్లు అడిగితే తెల్ల కాగితం మీద బస్తా ఇంతనని ఓ చిత్తు కాగితం బిల్లు ఇస్తున్నారు. ఎరువులే కాకుండా చీడ పురుగుల బాధ నుంచి విముక్తి చేసే పురుగుమందులు అమ్మే డీలర్లు సైతం ఇదే తంతు కొనసాగిస్తున్నారు. అయితే ఇదంతా పక్కా మోసం జరుగుతుందని తెలిసినా రైతులు తమ అవసరాలమేరకు చేసేదిలేక, ఎవరి చేత చెప్పుకోలేకపోతున్నారు. చెప్పినా పట్టించుకొనే అధికారులు లేకపోవడంతో డీలర్లు నోటికి ఎంత వస్తే అంత చెప్పిన ధరలకు కొనుగోలు చేసుకొని ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు.రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకుపోయినా, ఎరువుల దుకాణాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డీలర్ల వద్ద బేరసారాలు కుదుర్చుకొని ఇంకా వారి చేతులను తడుపుకుంటున్నారే తప్ప రైతుల బాధలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మాత్రం రైతులకు సబ్సిడీలు కల్పించి ఆదుకుంటాం, వ్యవసాయాధికారులు, సొసైటీల ద్వార రైతుల అవసరాల మేరకు గ్రామీణ ప్రాంతాలకే ఎరువులను అందించేందుకు శ్రీకారం చుట్టామని ప్రకటనలే తప్ప రైతులకు ఒరింగిందేమి లేదు. ప్రభుత్వ అసమర్ధతను ఆసరాగా తీసుకొన్న బడా డీలర్లు వందల సంఖ్యలో ఎరువులను తరలించి రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఉన్నత స్ధాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తేగాని, అధికారులు, డీలర్ల అసల బోగోతం బయటపడదు. దీనిపై డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మారుతీదేవిని మేజర్ న్యూస్ వివరణ కోరగా అధిక ధరలపై ఆరోపణలు మా దృష్టికి రాలేదంటున్నారు. డీలర్లు ఎవరైన మోసాలకు పాల్పొడుతుంటే పై అధికారుల దృష్టికి తీసుకుపోయి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment