Thursday, December 17, 2009
రాజకీయ సంక్షోభానికి టిడిపి, కాంగ్రెస్సే కారణం
కట్టంగూర్ మేజర్‌న్యూస్ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షో బానికి అధికార కాంగ్రెస్ పార్టి, ప్రతి పక్ష పార్టి టిడిపి, ప్రజారాజ్యం పార్టి లే ప్రధాన కారణమని జిల్లా బిజెపి అధ్యక్షుడు గోలి మదుసూధ న్‌రెడ్డి ఆరోపించారు. కట్టంగూర్ మం డల కేంద్రంలో బుధవారం మండల బిజెపి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పా ల్గోని ఆయన మాట్లాడు తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయం లో రాష్ట్ర కాంగ్ర ెస్ ప్రభుత్వం, కేంద్ర యుపిఎ ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నా రు. రాష్ట్ర శాస నసభలో ఒక నిర్ణిత కాల వ్యవది నిర్ణయించకుండా జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో తీర్మాణం లేకుండా నేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని బిజెపి డిమాం డ్ చేస్తుందన్నారు.కోస్తా, ఆంధ్ర, ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడం కాంగ్రెస్, టిడిపి, పిఆర్పీ అధినేతలు అడించే నాటకమన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి లిఖిత పూర్వకమైన విధివిధానాలతో రూపొందించిన ఉత్వర్వులును జారి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టిలు కలిసి పొటిచేసి అధి కారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తు ప్రజలను మభ్యపెడుతూ కాలం గడిపిందన్నారు.కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం త్వరితగతిన పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ జిల్లాలో ఈ నెల 18, 19, 20వ తేదిలలో బిజెపి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టిడిపి, పిఆర్‌పి అడే నాట కాలను ప్రజలకు తెలియచేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమివే శంలో రాష్ట్ర బిజెపి దళిత మోర్చా కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగి లయ్య, బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు గోలి ప్రభాకర్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పాల్వాయి బాస్కర్, గాదగోని శ్రీనివాస్‌గౌడ్, కొమటి బాస్కర్, ముడుగు రామ లింగయ్య, యాదగిరి, రాజు, బిక్షపతి, యాదయ్య పాల్గోన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment