రాపూరు: రాపూరు-చిట్వేల్ ఘాట్‌రోడ్డులో ఐరన్‌ఓర్‌లారీల జోరుతో ఆర్‌టీసి డ్రైవర్లు హడలిపోతున్నారు. నిత్యం రాపూరు నుండి కడపజిల్లాకు చిట్వేల్ మీదుగా పెద్దసంఖ్యలో ఈ వాహనాలు తరలిపోతున్నా వాటికి కళ్ళెం వేయలేకపోతుండటం గమనార్హం. అయితే ఈ వాహనదారులవల్ల నిత్యం రాపూరు-చిట్వేల్ ఘాట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ లారీలు ఇష్టానుసారం అతివేగంగా తిరుగుండటంతో వాటిని ఆపి కంట్రోల్ చేసేవారులేక పోవడం విశేషం. రాపూరు-చిట్వేల్ ఘాట్‌లో ముందే ప్రమాకర మలుపు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు ఆప్రమత్తమంగా వ్వవహరిస్తున్నారు. అయితే ఆర్‌అండ్‌బిశాఖ ఇక్కడ మాత్రం ప్రమాద సూచిక బోర్డులు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టకపోవడంతో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు.
భారీ వాహనాలు ఈ మార్గాన్ని ఎన్నుకోవడంతో ఈ ప్రాంతంలో వాహనదారుల వేగానికి అడ్డుకట్ట వేయలేకోయింది. రాపూరు-చిట్వేల్ ఘాట్‌లో ఏదైన ప్రమాదాలు జరిగిన స్పందించేవారు లేకుండా ఉన్నారు. అలాగే ఎదైన ప్రమాదం జరిగినా అక్కడ సెల్‌టవర్లుకూడా పనిచేయకుండా ఉన్నాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఘాట్‌లో ఉన్నాయి. రోడ్డుకూడా సక్రమంగాలేకపోవడంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు ఘాట్‌లో విలయతాండవం చేస్తుంటే అధికారులు మాత్రం వీటిపై దృష్టిపెట్టేవారు లేరని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు దీనిపై దృష్టిపెట్టవలసిన అవసరం ఎంతైనావుంది.
No comments:
Post a Comment