రాపూరు: మండల కేంద్రమైన రాపూరులోని హింధూ ప్రాధమిక పాఠశాల భవనం ఒరండా పెచ్చులూడి పఠాన్ గౌస్‌మెహిద్దీన్ అనే ఉపాధ్యాయునిి , 1వ తరగతి చదివే ఉప్పలపాటి అనిత అనే విద్యార్థినికి తలకు గాయాలైనాయి. వివరాల్లోనికి వెళితే. హింధూ ప్రాధమిక పాఠశాల భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు భవనాలపైన వర్షపునీరు చేరివుంది. దీంతో అక్కడక్కడా పెచ్చులూడ సాగాయి. 1వ తరగతి ఒరండాలో జరుగుతుండగా ఒక్కసారిగా పెచ్చులూడి ఆ ఉపాధ్యాయుని తలపై పడటంతో అతనికి తీవ్రగాయంకాగా, పక్కనేవున్న అనితకు స్వల్పగాయమైంది.
దీంతో మరో టీచర్ నాదానందరావు అతన్ని రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తీసుకెళ్ళారు. సమాచారం తెలుసుకున్న రాపూరు ఎంపిడిఒ ఇ వాణి సంఘటన స్థాలనికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆ స్కూల్ హెచ్‌ఎం వై నాగభూషణంను అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యార్థులను ప్రశ్నించగా హెచ్‌ఎం అక్కడ క్లాసులు నిర్వహించవద్దని చెప్పారని తెలిపారు. అయితే ప్రత్యాన్మాయం లేకపోవడంతో అక్కడ క్లాసులు నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఆమె జడ్పీ సిఇఒ రామిరెడ్డికి జరిగిన సంఘటనపై తెలిపింది. అనంతరం ఆయన జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయుల దృష్టికి తీసుకొని పోవడంతో ఆయన ఎంఇఒ కె జగదీశ్వర్‌ను జరిగిన సంఘటనపై ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న ఎంఇఒ జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుకున్నారు. అనంతరం గాయపడ్డ బాలికను పరిశీలించారు. గురువారం నుండి ఆ పాఠశాలలో ప్రత్యాన్మాయ చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎంఇఒ తెలిపారు. గాయపడిన టీచరు మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు. ఈ కార్యక్రమంలో రాపూరు విఆర్‌ఒ ఎం రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు
No comments:
Post a Comment