Tuesday, December 15, 2009
కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత
రాపూరు: కేసీఆర్, చిదంబరం, పిళ్లైలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టిడిపి నాయకులు మరికొందరు శనివారం చెనై్నకు గంగ నీటిని నిలుపుదల చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు చెనై్నకు గంగ నీటిని విడుదల చేయడంతో కండలేరు జలాశయం వద్ద ఉద్రక్తత వాతావరణ నెలకొంది. సమైక్య నినాదంతో ఆందోళనకారులు ఆదివారం ఉగ్రరూపం దాల్చారు. కండలేరు జలాశయం హెడ్‌రెగ్యలేటర్ నుండి సాయిగంగ కాలువ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని శనివారం రాత్రి 8గంటలకు గంగ అధికారులు గుట్టచప్పుడు కాకుండా విడుదల చేశారు. ఆదివారం సమాచారం తెలుసుకున్న రాపూరు ఎంపిపి సూర్యప్రకాష్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఎస్‌కె ముక్తియార్, తెలుగుదేశం నాయకులు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, ఆర్ రామచంద్రయ్య, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకోసం తాము పోరాడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా మళ్ళీ చెనై్నకు గంగ నీటిని తరలించడమేమిటని ప్రశ్నించారు. హెడ్‌రెగ్యులేటర్ వద్దగల డోమ్‌లైట్లు, కిటికీ అద్దాలు పగులకొట్టారు. సిబ్బంది మంచాలను ధ్వంసం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వాగ్వివాదానానికి దిగారు. ఆందోళనకారులు నీరు విడుదలచేసే యంత్రాలను నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న పొదలకూరు సిఐ అబ్దుల్ కరీమ్, రాపూరు, కండలేరు డ్యామ్ ఎస్‌ఐలు జయరావు, చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులకు సర్థిచెప్పారు. గంగను చెనై్నకు నిలిపివేయడంతో శాంతించారు. అయితే అధికారులు ఉత్తర్వుల మేరకు ఆదివారం నుండి చెనై్నకు కండలేరు నుంటి నీటి విడుదల నిలిపివేస్తామని డిఇ ఎంఎ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment