Tuesday, December 15, 2009
విజయేశ్వరిదేవికి ఘనస్వాగత
రాపూరు: రాపూరు మండలం పెంచలకోనలోని భగవతి శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి 5వ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీ మహాసభలో భారతదేశం తరపున తొలి మహిళా భారతీయురాలిగా ప్రసంగించి తిరిగి రావడంతో ఆదివారం ఆమెకు గూడూరు నుండి భారీ ర్యాలీతో రాపూరుకు చేరుకున్నారు. అడుగడుగా ఆమెకు విద్యార్థులు ప్లే కార్డులతో ఘనస్వాగతం పలికారు. అలాగే ఆమెను చూసేందుకు మహిళలు పెద్దసంఖ్యలో రాగ ఈప్రాంతమంతా మేళతాళాలతో కోలాహలం నెలకొంది. ఆమె స్థానిక సిద్దలయ్య దేవాలయ సెంటర్లో ప్రసంగించారు. వందకోట్ల భారతీయుల తరపున తొలి ఇండియా మహిళగా ప్రసంగించడం జరిగిందన్నారు. హిందూ మతానికి సంబంధి స్ర్తీల గురించి వివరించానన్నారు. తాను చేసిన ప్రసంగంపై విశేషస్పందన లభించిందన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమె కోరారు. ఆమె ప్రసంగించిన కొద్ది సమయానికి పెద్దసంఖ్యలో జనం గుమికూడినారు. పట్టణంలో ఆమెకు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీబోర్డులు ఆకర్షణగా నిలిచాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment