మోత్కూరు, మేజర్‌న్యూస్ : తెలంగాణప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఆటంకం అవుతుందనే మనస్తాపంతో మం డలంలోని దాచారం గ్రామానికి చెం దిన రంగారెడ్డిజిల్లా ఎల్‌బినగర్ కో ర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తెలంగాణవాది ఎండ్లపల్లి దయాకర ్‌రెడ్డి (40)తననివాసంలో ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడడంతో మండలంలో విషాదచ్ఛాయలు అలు ముకున్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగే పోరాటా లలో తెలంగాణ న్యాయవాదుల సం ఘం నుంచి ప్రధానపాత్ర పోషిస్తు న్నట్లు సమాచారం. కెసిఆర్ ఆమ రణ దీక్షతో కేంద్రప్రభుత్వం స్పం దించి ప్రత్యేకతెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై స్పష్టమై ప్రకటన చేయడంతో రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్ కోర్టు న్యాయ వాదులతో దయాకర్‌రెడ్డి విజ యోత్సవర్యాలీని ఆనందోత్సవా లతో నిర్వహించినట్లు సమాచారం. ఇటీవల సీమాంద్రనాయకులు, ప్ర జాప్రతినిధులు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసం హరించుతాయనే భాద దయాకర్ ్‌రెడ్డిలో కల్గి మనోవేధనగా ఉన్నట్లు తెలిసింది.తనఆత్మహత్య కొంతవరకైనా తెలంగాణప్రజలలో ఉన్న బల మైన ఆకాంక్షను ప్రభుత్వానికిచూపి మే ల్కొల్పుతుందనే ఉద్ధేశ్యంతో మరణ వాంగ్మూలాన్ని రాసుకుని తమ జేబు లో పెట్టుకొని బుధవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హ త్యకు పాల్పడినట్లు బందువులు తెలి పారు. దయాకర్‌రెడ్డి మరణ వా ర్తతో స్వగ్రామం దాచారంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ద యాకర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. భార్యవాసవి తల్లిదండ్రు లు కొండల్‌రెడ్డి, లక్ష్మమ్మలు కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రజలను కంట తడిపెట్టించింది.
దాచారంలో అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ప్రాణత్యాగంచేసిన న్యాయ వాది దయాకర్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం మండలంలోని స్వగ్రా మమైన దాచారంలో నిర్వహించా రు. టిఆర్‌ఎస్ శాసనసభపక్ష నాయ కుడు ఈటలరాజేందర్, పార్టీపోలిట్ బ్యూరో సభ్యుడు గుంతకళ్ళ జగదీ శ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు కల్వల ప్రకాష్‌రాయుడు, జిలా ్లప్ర దాన కార్యదర్శి కంచర్ల రామ కృష్ణా రెడ్డి, మంచగోవర్ధన్, యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పా ల్గొని మృతదేహానికి పూలమాలలు వేసి సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
No comments:
Post a Comment