Tuesday, December 15, 2009
మార్మోగిన ఘంటానాదం
భక్తవత్సలనగర్ (నెల్లూరు):ప్రత్యేక తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వ హామీని తక్షణమే ఉపసంహరించుకోవాలని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీబొమ్మ వద్ద సోమవారం ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటానాదంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఆంధ్రాను సాధించుకోడానికి అందరిపై బాధ్యత ఉందని తెలిపారు. తెలుగుభాష మాట్లాడేవారి కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కొందరు విచ్ఛిన్న శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, విద్యార్థి లోకం తరలి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల ప్రజల మనోభావాలను అధిష్టానం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఉద్యమాలకు ఊపిరి పోయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెనక్కు తీసుకునేంతవరకు ఈ ఉద్యమం ఆగదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజీకీయ పార్టీలకు అతీతంగా అందరూ సమైక్య ఆంధ్రా కోసం పోరాడాలని ఆయన కోరారు. సిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలలో ఎక్కువశాతం సమైక్య ఆంధ్రానే కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలోని రెండు, మూడు జిల్లాలకు మాత్రమే ఈ తెలంగాణా వాదన పరిమితమైందని అన్నారు. ఈ ఘంటానాదం ఉద్యమంతో రోజు రోజుకూ ప్రజలను చైతన్యపరుస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మంత్రులు రాజీనామా చేయాలి-పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిసమైక్య ఆంధ్రా కోసం సిఎంతో సహా ఇంకా కొనసాగుతున్న మంత్రులు రాజీనామా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన కోరారు. కెసిఆర్ నిరాహారదీక్ష చేస్తుంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం నేడు ఎంపి లగడపాటి ఆమరణ నిరాహారదీక్షను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని విమర్శించారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కావాలనే తెలంగాణా నినాదాన్ని అంటిపెట్టుకుని వేలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా మండలి సభ్యులు వైవి.రామిరెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణా వెంకయ్య, మదన్‌మోహన్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రూప్‌కుమార్ యాదవ్, జడ్పీటిసి సభ్యులు, వీరి చలపతి, యూత్‌కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షులు జివి.ప్రసాద్, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment