కోవూరు: కోవూరులో వైఎస్సార్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పచ్చి అవకాశవాది అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం మం డలాల్లో ఆదివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ కోవూరులో ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయని ప్రజలు ప్రశ్నించుకోవాలన్నారు.
2009 ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు మళ్లీ ఓట్లు వేయాల్సిన దుర్భతి పట్టిందన్నారు. డబ్బు ఆకర్షణకు అమ్ముడుపోయిన ప్రసన్న రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీపైనే విమర్శలు చేస్తున్నాడని అన్నారు. 1999లో కోవూరు ఉప ఎన్నికల్లో ఎన్టీఆర్ సోమిరెడ్డికి టికెట్ ఇస్తామని చెబితే తనకు వద్దని ప్రసన్నకు ఇవ్వాలని సూచించాడన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ప్రసన్న నిలకడలేని, విలువలేని వ్యక్తిగా విమర్శించారు. డబ్బులు ఉంటే చెల్లుబాటు అవుతుందని వైఎస్ఆర్ ఆకర్ష పథకంలో చేరాడన్నారు. ఏనాడూ ప్రజల కోసం ప్రసన్న పని చేయలేదని, అవకాశ వాదిగా, దొంగ లా, నంగి నంగి గా మాట్లాడేవాడని పేర్కొన్నారు. జగన్‌ను చూసి ఓట్లు వేయాలని ప్రసన్న కోరడం సిగ్గుచేటని, ఇంతకన్నా దారుణం ఏమీ లేదన్నారు. జగన్‌కు ఓట్లు వేస్తే అవినీతికి లైసెన్సు ఇచ్చినట్లేనని చెప్పారు.
ఎన్టీ రామారావు చొరవతోనే సోమశిల, కండలేరు రిజర్వాయర్ నిర్మాణాలు జరిగి 110 టీఎంసీల నీరు జిల్లాకు అదనంగా చేకూరిందన్నారు. ఓబులాపురం మై నింగ్ మాఫియాలో భాగస్వామిగా వ్యవహరించిన జగన్ మైనింగ్‌ను విదేశాలకు తరలించి కోట్లు గడించాడన్నారు. కోవూరు నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నిమిషానికి ఓ లారీ ప్రయాణించి 200 మంది ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన చెందారు. ఇళ్ల నిర్మాణం, వివి«ధ సంక్షేమ పథకాల పేరిట వైఎస్ఆర్ కోట్లు గడించి కొడుకుకి పంచి పెట్టారన్నారు. కోవూరు ఉపఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని, 2014 ఎన్నికల్లో ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయన్నారు.
అందుకనే కోవూరు ఓటర్లు అసమర్ధ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ నేతలను తరిమికొట్టాలని, అవినీతి సంపాదనతో వస్తున్న జగన్ సభలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జగన్ ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేలు ఇచ్చేందుకు డబ్బు సంచులు పంపారని ఇదంతా ఎవడబ్బ సొమ్ము కాదని, ప్రజలదేనని చెప్పారు. వైఎస్ విజయ తమపై కక్ష సాధింపు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం తోట కూర కథ గుర్తుకు వస్తోందన్నా రు. అవినీతి సొమ్ము ఇంట్లో లెక్కలు చూసుకున్నప్పుడు గట్టిగా మందలించి ఉంటే జగన్‌కు ఈ పరిస్థితి వచ్చే ది కాదని అన్నారు. అవినీతిపరులకు సహకరించకూడదని బైబుల్ చెబుతోందన్నారు. పోరాట యోధుడు సోమిరెడ్డి జిల్లాలో సోమిరెడ్డి పోరాట యోధుడిగా చంద్రబాబు కితాబిచ్చారు. గతంలో సోమశిల జలాలను కడపకు మళ్లించే ప్రయత్నాలను వైఎస్ఆర్ చేపట్టాడన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్న సోమిరెడ్డి ఖబడ్దార్ అంటూ వైఎస్ఆర్‌ను హెచ్చరించారన్నారు. అంతేగాక సారా ఉద్యమాన్ని సమర్ధవంతంగా నడిపిన వ్యక్తి సోమిరెడ్డేనని పేర్కొన్నారు. జిల్లాలో నిత్యం ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తూ పరిష్కారాన్ని కనుగొంటున్న వ్యక్తి కోవూరు నుంచి పోటీ చేయడం ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీతి, నిజాయతీగా వ్యవహరించే వ్యక్తి దొరకడం నేటి రోజుల్లో గగనమని, ప్రతి ఓటరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి సోమిరెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టను : సోమిరెడ్డి నీతి నిజాయతీగా ప్రజల కోసం ప ని చేస్తానని, ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టనంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. బాబుతోపాటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోవూరు ప్రజల గౌరవాన్ని కాపాడుతూ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపిస్తానన్నారు. పార్టీ తనపై ఉంచిన ఏ బాధ్యతనైనా నిర్వర్తించే సైనికుడిగా పని చేస్తానని, అదే విధంగా కోవూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జగన్‌ను చూసి ఓట్లు వే యాలని ప్రసన్న కోరడం సిగ్గుచేటన్నా రు.
అనంతరం టీడీపీ కోవూరు మం డల అధ్యక్షుడు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి ప్రసంగించారు. టీడీపీ నే తలు లాల్‌జాన్‌బాషా, ఎర్రన్నాయు డు, వర్ల రామయ్య, బొ జ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment