ఆనం వివేకానందరెడ్డి ఎబివిపి కార్యకర్తలపై చేయిచేసుకునే ప్రయ త్నం చేస్తూ దౌర్జన్యం చేశారని, దీనికి వ్యతిరేకంగా సోమవారం ఎబివిపి విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిం ది. స్థానిక సోమశేఖరపురంలోని ఎబి విపి కార్యాలయంలో జరిగిన విలే రుల సమావేశంలో నగర కార్యదర్శి మౌళి మాట్లాడుతూ వైఎంసిఎ గ్రౌం డ్‌లో నిర్మిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల అనుమతులు ఇవ్వడానికి వచ్చిన ఎఐ సిటి బృందం నెల్లూరుకు వచ్చిన విష యం తెలుసుకున్న ఎబివిపి కార్య కర్తలు వినతిపత్రం ఇచ్చేందుకు అక్క డకు చేరుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న కళాశాల కు అనుమతి ఇవ్వవద్దని ఎబివిపి డిమాండ్ చేసిందని తెలిపారు. విఆర్ కళాశాల ప్రభుత్వ నిధులతో నడుస్తుం దని యూజిసి గ్రాంట్ కూడా అందు తుండగా ప్రైవేటు మైనారిటీ కళాశాల ను ఎలా ఏర్పాటు చేస్తారని, ఎండో మెంట్ స్థలంలో భవనాన్ని ఎలా కడతా రని, ఆ భవన నిర్మాణానికి నిధులు ఎ లా వచ్చాయని, అక్కడకే చేరుకున్న ఆనం వివేకానందరెడ్డిని ఎబివిపి కార్య కర్తలు ప్రశ్నించారన్నారు. ఆనం వివే కానందరెడ్డి నేను ఎవ్వరికి సమా ధానం చెప్పనవసరం లేదని, విద్యా ర్థులపై చేయి చేసుకునే ప్రయత్నం చేస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారని తెలి పారు. ఆనం వివేకానందరెడ్డి దౌర్జ న్యానికి వ్యతిరేకంగా బహిరంగ క్షమా పణ చెప్పాలని, వెంకటగిరి రాజా ఆస్థులకు కాపాడాలని డిమాండ్ చేశా రు. ఈ దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ఎబివి పి బంద్‌కు పిలుపునివ్వడం జరిగిం దన్నారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని, అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని పేర్కొన్నారు.
గమనిక:ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను మినహాయించి, మిగిలిన విద్యాసం స్థలన్నింటికి బంద్ ప్రకటించడమైం దన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్‌ఛార్జి మహేష్, శీను, జగన్, ప్రకాష్, రాఘవ తదితరులు పాల్గొ న్నారు.
గమనిక:ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను మినహాయించి, మిగిలిన విద్యాసం స్థలన్నింటికి బంద్ ప్రకటించడమైం దన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్‌ఛార్జి మహేష్, శీను, జగన్, ప్రకాష్, రాఘవ తదితరులు పాల్గొ న్నారు.
No comments:
Post a Comment