నెల్లూరు: తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్వహించిన రోడ్ షోలకు ప్రజలు పెద్దగా రాలేదంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. అప్పటి ఓదార్పు ఏదంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రశ్నించింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం - జగన్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొడవలూరు మండలంలో పర్యటించారు. 18 చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేశారు. కొడవలూరు, తలమంచి, గండవరం తదితర సభలకు జనం బాగానే కనిపించారు. మిగిలిన సభలు మాత్రం జనంలేక పలుచనయ్యాయి. గుండాలమ్మపాళెంలో ఇరవై ముప్పై మంది కూడా కనిపించలేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చేపట్టిన రోడ్‌షో అనుకోకుండా ఏర్పాటు చేసింది కూడా కాదు. ఇక్కడ ఆదివారమే జగన్ ప్రచారం చేయాల్సి ఉంది. కానీ... అది సోమవారానికి వాయిదా పడింది. అయినప్పటికీ జనం లేకపోవడంతో జగన్ పార్టీ నేతల్లో కలవరం మొదలైందని ఆంధ్రజ్యోతి రాసింది. కోవూరు నియోజకవర్గంలో ఆదివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనకు వచ్చిన భారీ స్పందనతో పోల్చుకుని మరింత ఆందోళన పడుతున్నారు. అవినీతి సొమ్ముతో పార్టీ పెట్టిన జగన్‌ను బహిష్కరించాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ప్రజలు ప్రతిస్పందించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందపడుతున్నట్లు కూడా ఆ పత్రిక రాసింది.
రాష్ట్ర రాజకీయాలపై, నేతలపై విమర్శలు చేయకుండా, తన ప్రసంగాన్ని వేదాంత ధోరణి, ఆవేదనాపూరిత స్వరంతో జగన్ కొనసాగించారని ఆ పత్రిక రాసింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రాజుపాలెంలో బహిరంగసభకు జగన్ వస్తుండగా, ఎన్నికల అధికారి పోలీసులను వెంటబెట్టుకుని జగన్‌ను ఆపారు. దీంతో జగన్ పార్టీ నేతలు, ఎన్నికల అధికారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు జగన్ కాన్వాయ్‌ను అధికారులు ఇందుకుపేట మండలం జగదేవిపేటకు పంపారు. కాన్వాయ్‌లో పరిమితికి మించి ఉన్న ఒక ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

No comments:
Post a Comment