నెల్లూరు: 2009 సంవత్సరం సాధారణ ఎన్నికలలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రయ్య గౌడ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు లో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉదయం రామచంద్రయ్య గౌడ్ పలువురు కార్యకర్తలతో కలిసి బాబు సమక్షంలో టిడిపిలోకి చేరారు. రామచంద్రయ్యతో పాటు పిఆర్పీ, కాంగ్రెసు కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లను తగు విధంగా కల్పిస్తామని చెప్పారు. అవినీతి విషయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, అధికార కాంగ్రెసు పార్టీ దొందు దొందేనని అన్నారు.
రాష్ట్రంలో మంచి పాలన కోసం తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ప్రజలకు సూచించారు. టిడిపి అభ్యర్థిని గెలిపించి మిగతా పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. కాగా ప్రచారం ముగించుకున్న చంద్రబాబు అటు నుండి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

No comments:
Post a Comment