రాష్ట్రంలో పేదలు, రైతుల కోసం పనిచేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని ఆ పార్టీ నాయకుడు జగన్ తెలిపారు. మంగళవారం ఆయన ఇందుకూరుపేట మండలం జగదేవిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు కుళ్లిపోయి ఉండటంతో, విలువలు పెంచి, నిజాయితీకి అర్ధం చెప్పేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, దేశం కుమ్మక్కు
అవినీతికి మారుపేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిస్తే, ప్రతిపక్షం కుమ్మకై పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదనే కారణంలో తమ పార్టీపై కుట్ర చేస్తున్నారని, తిప్పికొట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
మూటలు దిగుతున్నాయ్ ప్రసన్నను ఓడించేందుకు డబ్బు మూటలు దిగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రచారంలో ప్రసన్న, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు, నెలవల సుబ్రహ్మణ్యం, బట్టేపాటి నరేంద్రరెడ్డి, గునపాటి సురేష్‌రెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అబ్బాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగన్ డేవిస్‌పేట, కొత్తూరు, ఇందుకూరుపేట, సోమరాజుపల్లె, కొరుటూరు, మైపాడు, గంగపట్నం, పల్లెపాడు గ్రామాలలో పర్యటించారు. రావూరు, పున్నూరు, కొమరిక, లేబూరు గ్రామాల పర్యటన రద్దు కావటంతో కార్యకర్తలు నిరాశకు గురిఅయ్యారు.

No comments:
Post a Comment