నెల్లూరు నగరం.. మంగళవారం రాత్రి.... సమ యం 11 గంటలు... ప్రజలంతా అప్పుడే కునుకు తీస్తూ గాఢ నిద్రలోకి జారుకుంటున్నారు... అప్పటివరకు గిరగిరా తిరుగుతూ దోమలను, ఉక్కపోతను తరిమేస్తున్న ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో దో మల స్వైరవిహారం ప్రారంభమైంది. ప్రజలంతా వీధుల్లోకి పరిగెత్తాల్సి వచ్చింది... ఏమైందా అని ఆరా తీస్తే... ఇంకేముంది రాత్రుళ్లూ విద్యుత్ కోత ప్రారంభమైంది.
కావలి పట్టణంలో అధికారికంగా కోత నాలుగు గంటలే. అది కూడా పగలే. కానీ సోమవారం రాత్రి 10.15 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ 11.30 గంటలకు వచ్చింది. పగలు కోతలన్నారు.. రాత్రుళ్లు కరెంట్ తీయడమేమిటని అడిగితే అధికారులు వద్ద సమాధానం లేదు. అది అంతే అంటున్నారు.
ఉదయగిరి పట్టణంలో అధికారిక కోత పగలు ఆరు గంటలు, అయితే మంగళవారం రాత్రి 10.45 గంటలకు కరెంట్ పోయింది. 12 గంటలకు వ చ్చింది. మళ్లీ రాత్రి 1.30 గంటలకు తీశారు. 3.45 గంటలకు ఇచ్చారు. దీంతో ప్రజలకు కునుకు లేకుండాపోయింది. ఇది జిల్లాలో రాత్రి పూట విద్యుత్ సరఫరా పరిస్థితి. ఒక ఊరు కాదు ఒక ప్రాంతం కాదు జిల్లా అంతా ఇదే పరిస్థితి. పగలంతా కష్టపడి రాత్రి పూట ప్రశాంతంగా కునుకు తీద్దామనుకున్న ప్రజలకు ఆ వీలు లేని పరిస్థితి ఏర్పడుతోంది. అటు ఉక్కపోత ఇటు దోమల బెడదతో ప్రజానికానికి నిద్ర కరువవుతోంది. ట్రాన్స్ అధికారుల తీరు జిల్లా వాసులకు నరకం చూపుతోంది.
పెరుగుతున్న కోతలు భానుడి తీవ్రత పెరుగుతున్న కొద్దీ జిల్లాలో విద్యుత్ కోతల సమయం కూడా పెరుగుతోంది. అనధికారిక కోతలు అధికమవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పగటి పూట మాత్రమే కోతలు విధిస్తున్నామని అధికారులు ప్రకటించినప్పటికి పగలు, రాత్రి తేడా లేకుండా భారీగా కోతలు విధిస్తున్నారు.
రాత్రి కోతలతో ఇక్కట్లు సకలజనుల సమ్మె పేరుతో ఈ ఏడాది వర్షాకాలం నుంచే కోతలు విదిస్తూ వస్తుండడంతో పగటి పూట కోతలకు ప్రజలు కొంత మేర అలవాటుపడ్డారు. అయితే ప్రస్తుతం ఎండలు ముదరుతున్న సమయంలో రాత్రిళ్లు కూడా కోత విధిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత ఇబ్బందికరంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
వాడకం తక్కువ, సరఫరా ఎక్కువ జిల్లాలో విద్యుత్ సరఫరాలో వింత పరిస్థితి ఏర్పడింది. సహజంగా సరఫరా కంటే డిమాండ్ పెరిగితే కోతలు విధిస్తారు. కానీ జిల్లాలో సరఫరా కోటా కంటే వినియోగం తక్కువగా ఉన్నప్పటికి భారీగా కోతలు విధిస్తున్నారు. రోజుకు 8.032 మిలియన్ యూనిట్ల కోటా ఉండగా 7.3 మిలియన్ యూనిట్ల వాడకం మాత్రమే ఉంటోంది. ఈ ప్రకారం జిల్లాలో కోతలు పూర్తిగా ఉండకూడదు. అయితే రాష్ట్రవ్యాప్తం గా ఇతర ప్రాంతాలలో డిమాండ్ అధికంగా ఉంటోందనే కారణంతో అధికారులు జిల్లాలోనూ కోతల మోత మోపుతున్నారు
No comments:
Post a Comment