కోవూరులో ప్రతిపక్షాలను కట్టడి చేయడమెలా!? అక్కడ మళ్లీ పాగా వేయడమెలా!? అధికార కాంగ్రెస్‌లో అంతర్మథనమిదే! తెలంగాణలో జరుగుతున్న ఆరు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల కంటే కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే ఆ పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. ఇక్కడ విజయం సాధించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాన్ని ఇవ్వగలుగుతామని భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల తర్వాత జగన్ వర్గంపై వేటుతో ఖాళీ అయిన 17 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కోవూరులో గెలుపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి టానిక్‌లా పనికొస్తుందని కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు.
జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తదితరులు కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కోవూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే, ఈనెల 11న కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరంజీవి, 15న మళ్లీ చిరంజీవితోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోవూరులో ప్రచారం చేయనున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సా నుభూతి కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు. తాజా గా ఈ నియోజకవర్గంలో జగన్ ప్రచారానికి జనం పలుచగా ఉండడం కాంగ్రెస్ వర్గాలను సంతోషపరుస్తోంది.

No comments:
Post a Comment