కోవూరు : కోవూరు ఉప ఎన్నికలు జరుగుతున్న కోవూరు నియోజకవర్గంలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అడుగడుగునా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జ్యోతుల నెహ్రూ, జనక్ ప్రసాద్ సోమవారం సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి కాన్వాయ్‌ను అనుసరిస్తూ పెద్దసంఖ్యలో వాహనాలు తిరుగుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని చెప్పారు.
చెక్‌పోస్టుల్లోని పోలీసులు సెల్యూట్ చేసి మరీ మంత్రి కాన్వాయ్‌ను సాగనంపిన వైనాన్ని వారు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఉప ఎన్నికలను న్యాయబద్ధంగా, సమర్థంగా నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకునేం దుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. కడప తరహాలో నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. అధికారులను కాంగ్రెస్ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జనక్ ప్రసాద్ ఆరోపించారు.
No comments:
Post a Comment