నెల్లూరు : నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాభవాన్ని మొగ్గలోనే తుంచేయాలనుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భా విస్తున్న నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికకు చిరంజీవిని దూరంగా ఉంచాలనుకుంటున్నదా? ఇప్పటిదాకా చిరంజీవి ఎక్కడె క్కడ ప్రచారం చేయాలో ఖరారు చేయని నేపథ్యంతో పాటు జిల్లా సీనియర్ మం త్రి ఆనం రామనారాయణరెడ్డి అంతా తానై పర్యవేక్షిస్తూ కొత్త తర్కాన్ని ముందు కు తీసుకురావటమే ఈ అనుమానాలకు తావిస్తున్నది.
ఇటీవల ఆనం నెల్లూరు లో మాట్లాడుతూ స్థానికేతర నాయకత్వం ప్రచారం తమకు అవసరం లేదని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించగల సత్తా ఉన్న నాయకులు జిల్లాలో చాలా మంది ఉన్నారని బాంబు పేల్చినట్టు వార్తలు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక తాను అనుకున్నవన్నీ సాధించుకుంటున్న చిరంజీవిని దృష్టిలో ఉంచుకునే ఆనం ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని పార్టీ వర్గాలలో చర్చ జరు గుతున్నట్టు తెలిసింది. చిరంజీవి సామాజిక వర్గానికి జిల్లాలో పెద్దగా పునాదు లు లేకపోవటం, ఆయన చరిష్మా పనిచేస్తుందన్న గ్యారంటీ లేకపోవటం వంటి కారణాల రీత్యా చిరంజీవిని దృష్టిలో ఉంచుకొనే ఆనం ఈ మాటలు అని ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది.
బొత్స-చిరు బంధమే కారణమా?
ఇటీవల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకూ మ ధ్య భేదాభిప్రాయాలు తీవ్రమైన తరుణంలో ఆనం సోదరులు కిరణ్‌కు పూర్తి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా రామనారా యణరెడ్డి మాటకు కిరణ్ విలువ ఇస్తున్నారు. రెండుసార్లు సమన్వయ కమిటీ సమావేశాలు జరిగినప్పుడు చిరంజీవి, బొత్స, డీఎస్, ఉప ముఖ్యమంత్రి దా మోదర రాజనరసింహ ఒక వర్గంగా తయారయ్యారని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్ సమక్షంలోనే వారు సీఎంను నిలదీశారన్న వార్తలు వ చ్చాయి. మరోవైపు ముఖ్యమంత్రిని మార్చి తీరాలన్న డిమాండ్‌తో కొందరు మంత్రులు అధిష్ఠానానికి లేఖ రాసినట్టు వచ్చిన వదంతుల వెనుక బొత్స హస్తం ఉండవచ్చునని కిరణ్ భావిస్తున్నట్టు కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ పరిణామాలను విశ్లేషిస్తే కోవూరు ప్రచారానికి స్థానికేతరులు రానక్కరలేదని ఆనం చెప్పటం వెనుక చిరంజీవికి చెక్ పెట్టేందు అని పార్టీలో చర్చ జరుగుతు న్నట్టు తెలిసింది.
క్రెడిట్ తమకు రావాలనే
కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి విజయం సాధిస్తే ఆ క్రెడిట్‌ను తా మే పొందాలన్న తపనతో ఆనం అలా వ్యాఖ్యానించి ఉండవచ్చునన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ను ఢీకొని కాంగ్రెస్ అభ్యర్థిని ఒంటిచేత్తో, ఎవరి ప్రచారం అవసరం లేకుండా గెలిపించామన్న పేరు అధిష్ఠానం వద్ద నమో దయ్యేలా చూసుకునే వ్యూహంలో భాగంగా ఆనం ప్రకటనను అర్థం చేసు కోవ లసి ఉంటుందని సీనియర్ నేతలు అనుకుంటున్నట్టు తెలిసింది.
No comments:
Post a Comment