నెల్లూరు కోవూరు ఉపఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలంతా తరలి వస్తున్నా రు. మండల, గ్రామ ఇన్‌చార్జులుగా బాధ్యతలు తీసుకున్న నేతలు అక్కడే మకాం వేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తొలి విడత ప్రచారాన్ని విజయవంతంగా ముగించుకున్న చంద్ర బాబు రెండో విడత ప్రచారం కోసం విచ్చేస్తున్నారు.
గత మూడు రోజులుగా జగన్ జరుపతున్న రోడ్‌షో చివరి దశకు చేరింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఖరారైంది. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కోవూరు నియోజకవర్గంలో కోవూరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇలా ప్రధాన పార్టీలు ఎవరికి వారు ప్రచారాలపై దృష్టి పెట్టారు.
నేడు బాబు పర్యటన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇప్పటికే మూడు విడతల ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ఈ నెల 4న చంద్రబాబు బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ప్రధానంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని బాబు ప్రసంగించారు. అదే రోజు రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండల, గ్రామ ఇన్‌చార్జి బాధ్యతలను నేతలకు అప్పగించి ఎలా వ్యవహరించాలన్నది సూచనలు చేశారు. రోజువారీ పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని ఆదేశిం చారు. బాబు తొలి విడత పర్యటన టీడీపీ కేడర్‌లో నూతనోత్సాహం నింపింది. పార్టీ అగ్ర నేతలతో పాటు, జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు వారికి కేటాయిం చిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తి స్తున్నారు.
రెండు రోజుల క్రితం విడవలూరులో సోమిరెడ్డి జరిపిన ప్రచారానికి పెద్ద ఎత్తున జనం విచ్చేశారు. ఎవరికివారుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు సాగిస్తుండటంతో రోజు రోజుకు టీడీపీ బలం పుంజుకుంటోంది. ఈ నేప థ్యంలో బాబు రెండో విడత రోడ్‌షోను గురు వారం ఇందుకూరుపేటలో నిర్వహించ నున్నారు. రోడ్‌షో అనంతరం నేతలతో చంద్రబా బు సమావేశమై ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చ ర్చించనున్నారు. శుక్రవారం ఉదయం హెలి కాప్టర్‌లో ఆయన తెలంగాణ ప్రాంతంలో ప్రచార ానికి వెళ్లనున్నారు.

No comments:
Post a Comment