కోవూరు: సీబీఐ అరెస్టుకు భయపడి ఇంట్లో దాక్కున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కోవూరులో గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీ పార్టీ అభ్యర్ధి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దొంగ అయితే, జగన్ గజదొంగని అభివర్ణించారు. ఎవరబ్బ సొమ్మని రాష్ట్రాన్ని దోచుకున్నారని జగన్‌పై బాబు విరుచుకుపడ్డారు. జగన్ ఓటు కోసం వస్తే నిలదీయాలన్నారు.
నెల్లూరు జిల్లాలోని కోవూరులో చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సర్కార్ బ్రాంది ప్రభుత్వంలా మారిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే చిత్తూరు, విజయనగరం జిల్లాలో ఏసీబీ దాడులు జరిగాయన్నారు. బొత్స సత్యనారాయణ పీసీసీ, మంత్రి పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే రాష్ట్రంలోనూ సైకిల్ ప్రభంజనం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాదిలో అసమర్ధ కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. నాయకత్వ లోపంతో, అవినీతితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెసు 4 రాష్ట్రాల్లో దెబ్బ తిన్నదని, కోవూరులో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యూపీలో సైకిల్ దెబ్బకు హస్తం, ఏనుగు పటాపంచలయ్యాయని, రాష్ట్రంలో కూడా సైకిల్ దెబ్బకు హస్తం, ఫ్యాన్ తుక్కుతుక్కు అవుతాయని ఆయన అన్నారు.
తృతీయ కూటమి ఏర్పాటు ద్వారా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. సిగ్గులేని ప్రభుత్వం కరెంట్ లేక మంచినీళ్లు ఇవ్వడం లేదని, బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం ఇస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని సిగ్గులేని నాయకత్వం నడుపుతోందని, ఈ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని బాబు అన్నారు. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. మహిళా దినోత్సవం, హోలీ పండుగ ఒకే రోజు రావడం శుభపరిణామమని చంద్రబాబు పేర్కొన్నా
No comments:
Post a Comment