నెల్లూరు : నెల్లూరు లోక్‌సభ ని యోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల కు కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టు కనిపిస్తు న్నది. అసెంబ్లీ ఉప ఎన్నికల మాట అటుంచితే నెల్లూరు లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉంటారన్నదానిపై ఆసక్తికరమైన చ ర్చ జరుగుతున్నది. వైఎస్ జగన్ వర్గంలో ప్రముఖుడైన మేకపాటి రాజమో హన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండటమే అందుకు కార ణం. మేకపాటిని ఢీకొన గలిగిన సత్తా ఉన్న వర్గాలు జిల్లాలో రెండే ఉన్నాయి. ఒకటి ఆనం బ్రదర్స్ వర్గం అయితే, రెండవది నేదురుమల్లి వర్గం.
ఆనం వర్గం దూరం...
అయితే నెల్లూరు లోక్‌సభ బరిలో నిలవటానికి ఆనం వర్గం ససేమిరా ఆంటున్నట్టు తెలిసింది. అటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ, సోదరుడు, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కానీ తమకు ఆ ఆలోచన లేదని ఇప్పటికే ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. మేకపాటిని ఓడించటమే తమ లక్ష్యం అని, అవసరం అయితే తమ సోదరులలో ఎవర మైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మొదట్లో వివేకా ప్రకటించారు. అయితే ఆ తర్వాత వారు ఆ ప్రతిపాదనకు దూరమయ్యారు. మేకపాటిపై పోటీ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి కానీ, ఆయ న సతీమణి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మి కానీ ముందుకువస్తే తాము వారికి విస్తృతంగా ప్రచారం చేసి గెలిపించే పూచీ తీసుకుంటామని ఆనం సోదరు లు ఆ తర్వాత చెప్పుకొచ్చారు.
తెరపైకి రాజ్యలక్ష్మి...
ఈ నేపథ్యంలో జిల్లాలో మరో బలమైన నేదురుమల్లి వర్గంపై అందరి దృష్టీ మళ్ళింది. అంగ, అర్ధ బలాలలో సమతూకంగా ఉండటంతో పాటు రాజకీయంగా నేదురుమల్లి కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలు పార్టీకి అనుకూలంగా మలచుకోవచ్చునన్న ఆలోచన కాంగ్రెస్ నాయకత్వంలో ఉ న్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మి పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. వయోభారం కారణంగా జనార్దన్‌రెడ్డి పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి రాజ్యలక్ష్మిని రంగంలోకి దింపితే మహిళ అన్న సానుభూతి, కుటుంబానికి ఉన్న పలుకుబడి, వర్గ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా కలసికట్టుగా గెలి పిస్తామన్న ఆనం సోదరుల హామీ, మూడో వర్గమైన ఆదాల ప్రభాకరరెడ్డి సై తం అనుకూలంగా పనిచేసేందుకు వీలు... ఇన్ని కారణాల రీత్యా రాజ్య లక్ష్మిని అభ్యర్థిగా నిలిపితే పోటీ రసవత్తరంగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కోవూరు ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ త్వరలో జిల్లాలో పర్యటించనున్న సంద ర్భంగా రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వం విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది
No comments:
Post a Comment