నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో న్యాయం అమలు చేశారు నెల్లూరు పోలీసులు! ఆదివారం కోవూరు ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చిన చంద్రబాబు.. రాత్రి 10 గంటలకు కొడవలూరు మండలం యల్లాయపాళెంతో తన ప్రసంగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత సుమారు పది నిమిషాలు మాట్లాడకుండా జనానికి నమస్కారం పెడుతూ ముందుకు సాగారు. చంద్రబాబు విషయంలో ఇది పోలీసులకు ఏమాత్రం తప్పుగా కనిపించలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి ఇదే గ్రామంలో ప్రచార సభ ముగించారు.
తన కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న జనానికి ప్రచార రథం మీద నిలబడి నమస్కారం పెడుతూ ముందుకు పోవాలనుకున్నారు. ప్రతి గ్రామంలో జనం తన వాహనానికి అడ్డుపడటంతో జగన్ వాహనం దిగి వారితో చేతులు కలుపుతూ వచ్చారు. సరిగ్గా 10 గంటలు దాటుతూనే పోలీసులు వచ్చి జగన్‌ను వాహనం నుంచి కిందకు దిగరాదని అడ్డుకున్నారు. నార్త్ రాజుపాళెంలో జగన్ సభ ఉంటుందని.. వేలాది మంది రాత్రి 8 గంటల నుంచి ఎదురుచూశారు.
రాత్రి 10 గంటలు దాటుతూనే పోలీసులు జనాన్ని బెదరగొట్టి పంపేశారు. ఈ మార్గంలో వెళ్లరాదంటూ పోలీసు అధికారులు జగన్ వాహనాన్ని అడ్డుకున్నారు. వేలాది మంది జనం రాజుపాళెంలో ఎదురు చూస్తున్నందున అక్కడికి వెళ్లి నమస్కారం పెట్టినా ప్రచారం చేసినట్లే అవుతుందని అభ్యంతరం చెప్పారు. తాము సూచించిన మార్గంలోనే రాత్రి విడిదికి వెళ్లాలని ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్ కూడా రాజుపాళెం సర్కిల్‌కు వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాహనం ఆ మార్గంలో వెళ్లరాదని హుకుం జారీ చేశారు. అధికారుల ద్వంద్వ నీతిపై మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, పార్టీ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
తాము ప్రచారం చేయబోమని, అయితే తాము కోరుకున్న మార్గంలోనే రాత్రి విడిది కేంద్రానికి వెళ్తామని చెప్పారు. ఇందుకు పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో జగన్ ప్రచార వాహనం నుంచి దిగి కారులో తన విడిది కేంద్రానికి వెళ్లారు. రాజుపాళెం సభ రద్దు కావడంతో వేలాదిగా తరలివచ్చిన జనం నిరాశతో వెనుదిరిగిపోయారు. ఉదయం నుంచి కూడా పోలీసులు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి చెందిన ప్రచార వాహనాలను అడ్డుకున్నారు. కొన్ని వాహనాలను సీజ్ చేశారు. జగన్ కాన్వాయ్‌లో మీడియా వాహనాలను కూడా అనుమతించలేదు.
No comments:
Post a Comment