కోవూరు : రాష్ట్రంలో ప్రజలు తమ వైపే చూస్తున్నారని, కోవూరు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థికే పట్టం కడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడవలూరు మండలంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మా ట్లాడుతూ ఈ ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయనే ఆలోచన చేయాలన్నారు. విలువలు లేని రాజకీయం, విశ్వసనీయతకు ఈ ఎన్నికలు పరీక్షగా మారిందన్నారు. వీటిని కాపాడేందుకు ప్రస న్న, రాజమోహన్‌రెడ్డిలు తమ పదవులను త్యాగం చేశారన్నారు. పేదలు, రైతుల కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యమని అన్నారు.
బాబుపై విమర్శలు రోడ్‌షోలో పాల్గొన్న వైఎస్సార్సీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విజయమ్మ నంగినంగిగా ఉంటుందని, జగన్ దోపిడీ, గజదొంగని విమర్శించిన చంద్రబాబు చరిత్ర ఏమిటన్నది తెలుసుకోవాలన్నారు. శవాలపై చిల్లర ఏరుకునే వాడు బాబు అని అసలు బ్రోకర్ ఆయనేనని ఘాటుగా విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. మామను వెన్నుపోటు పొడిచి మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి వైఎస్ కుటుంబాన్ని విమర్శించే అర్హత ఎక్కడిదన్నారు.
జగన్ వెంట నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నేదురమల్లి పద్మనాభరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా కొడవలూరులో ఉదయం 9గంటలకు చేరుకోవాల్సి ఉం డగా, 10.45 గంటలకు వచ్చారు.
No comments:
Post a Comment