కోవూరులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. అగ్రనేతలు రంగంలోకి దిగడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌ను పురిట్లోనే చంపేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. విశ్వసనీయత లేని టీడీపీ-కాంగ్రెస్‌లకు డిపాజిట్లు రానీయద్దని జగన్ జనాన్ని అభ్యర్థించారు.
రెండోవిడత కోవూరు ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి స్పందన లభించింది. సముద్ర తీరప్రాంతాల్లో బాబు రోడ్‌షోకు మత్స్యకారులు ఘనస్వాగతం పలికారు. ఇందుకూరుపేట మండలంలో జేజేపేటలో ప్రారంభమైన ప్రచారం.. డేవిస్‌పేట, ఇందుకూరుపేట, మైపాడు మీదగా గంగపట్నం దాకా సాగింది. టూర్ మొత్తం అవినీతి పార్టీలను ఓడించండి.. అసమర్ధ ప్రభుత్వానికి బుద్ధిచెప్పండంటూ బాబు ప్రసంగించారు.
కోస్టల్ కారిడార్ పేరుతో గంగపుత్రుల నోట్లో కాంగ్రెస్ సర్కారు మట్టి కొట్టిందని విమర్శించారు. YSR కాంగ్రెస్ పార్టీని పురిట్లోనే చంపేయాలని ప్రసన్నకుమార్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు. అటు బాబు ప్రచారానికి ధీటుగా జగన్ టూర్ కొనసాగుతోంది. నాలుగో రోజు ఇందుకూరుపేట, కొడవలూరు మండలాల్లో పర్యటించారు యువనేత.
తన తండ్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరుగున పడిపోతున్నాయని..అవి తిరిగి పేదలకు అందుబాటులోకి రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రాజుపాలెం బహిరంగసభలో అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు మ్యాచ్ పిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఇవాళ కోవూరు, విడవలూరులో జగన్ టూర్ కొనసాగుతుంది. అన్ని పార్టీల ప్రచారానికి జనం భారీగా వస్తుండండతో గెలుపు ఎవరిని వరిస్తుందనే టెన్షన్ ఎలక్షన్ తర్వాతే వీడనుంది.

No comments:
Post a Comment