వైఎస్‌ఆర్‌సి పార్టీ అధినేత వై.ఎస్‌జగన్ ఏమొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేశాడనా, వందలాది మందిని ఖూనీ చేసి హత్యా రాజకీయాలు నడిపారనా, అతని భాగస్తుడు గాలి జనార్దన్‌రెడ్డి ఈ జిల్లాలోని రోడ్లను సర్వనాశం చేసి పలువురిని పొట్టనపెట్టుకున్నాడనా అని ప్రశ్నించారు.కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఊసరివెల్లి అని విమర్శించారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సూటుకేసులిచ్చి ఆ ఊసరివెల్లిని కొనుగోలు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓట్లేయాలని వైఎస్ జగన్ ఎలా అడుగుతారని అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను అరెస్టు చేస్తామని సిఐబి చెప్పకుండానే ఆ పార్టీ నాయకులు ఎలా నిర్ణయించుకుంటారన్నారు. ఆ పేరుతో పర్యటన రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నారని విమర్శించారు. జగన్‌ను అరెస్టు చేస్తే తమ ప్రతాపం చూపుతామనీ, రాష్ట్ర అగ్నిగుండం అవుతుందనీ నాయకులు ప్రకటించడం చూస్తే వారికి చట్టం, న్యాయం అంటే గౌరవం లేదా అన్నారు. అవినీతి పరులనూ, చట్టాలను అతిక్రమించే వారిని అరెస్టు చేయాలని డిమాండు చేశారు. వైఎస్‌ఆర్‌సి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎప్పుడో జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఎపిఐఐసి ఛైర్మన్‌గా ఉన్న ఆయన హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నారు. అలాంటి వ్యక్తి నీతి గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన టిడిపి ఎస్‌సి జిల్లా అధ్యక్షులు బద్దెపూడి రవీంద్ర ఉన్నారు..
No comments:
Post a Comment