online marketing

Friday, March 9, 2012

కోవూరు నియోజకవర్గాన్ని తన నియోజకవర్గం వలె అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఇద్దరు కుమ్కక్కయ్యారని, వారు కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించాలని ప్రయత్నించి విఫలమయ్యారని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కొడవలూరు మండలం నార్తురాజుపాళెం హైవే వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురె డ్డి సత్తా గల అభ్యర్థి అని, ఆయనకు మీ ఆశీర్వాదం అందించాలన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని తన నియోజకవర్గం వలె అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కోవూరుకు ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో ఓటర్లు ఆలోచించాలన్నారు. మూడేళ్ల క్రితం టీడీపీ అభ్యర్థి అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికే ఓట్లు వేసి గెలిపించారన్నారు.

అప్పుడు వైఎస్‌ తిరిగినప్పటికీ ప్రసన్నే గెలిచారన్నారు. అయినా మూడేళ్లలో కోవూరులో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటాడో తెలుసా అన్నారు. ఇలా పార్టీ మారేవారికోసం ‘యాంటీ డిఫెక్షన్‌ లా’ అనే చట్టాన్ని తేవడం జరిగిందన్నారు. దీనివల్ల అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయడం, రాజీనామా, వేటు వేయడం జరుగుతుందన్నారు. 12 సార్లు జరిగిన ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో పోరాడుతూనే వస్తుందన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుతో పోరాడితే ఆయన తనయుడు జగన్‌ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం గత సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవారికి చేరేవిధంగా చూస్తుందన్నారు. అదేవిధంగా 108, ఆరోగ్యశ్రీ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. గతంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేలు ఉండగా, వాటిని భారీగా పెంచడం జరిగిందన్నారు. అలాగే మత్స్యకారులకు పక్కా గృహాల నిర్మాణానికి రూ.65 వేల వరకు ఇస్తున్నామన్నారు. అర్బన్‌ ఏరియాలో రూ.55 వేలు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అదనంగా 30 లక్షలు రేషన్‌కార్డులు, 8 లక్షలు పెన్షన్‌లు, 12.5 లక్షల పక్కా ఇళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం కిలో రూపాయ బియ్యం పొందుతున్నవారు 2.5 కోట్ల మంది వున్నారన్నారు.

అలాగే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లక్ష 16 వేల మందిని గుర్తించి భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిభ కలవారికే స్థానం కల్పిస్తున్నామన్నారు. అలాగే రాజీవ్‌ యువకిరణాల ద్వారా వివిధ రంగాల్లో ఏడాదికి 5 లక్షల చొప్పున మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే రైతులకు లక్ష వరకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పిస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో శ్రీనిధి ఏర్పాటు చేసి మహిళా బ్యాంకులు ప్రతి మండలానికి రూ.25 లక్షల చొప్పున ఒక భవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవూరు ఉప ఎన్నిక చరిత్ర సృష్టించబోతుందని సిఎం అన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh