కోవూరు; కోవూరు రేపు సీఎం రాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివా సులు రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 9న విచ్చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి వెంకట రమణ, ఆనం రామనారాయణారెడ్డిలు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. వీరుగాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రధాన నేతలు గ్రామాల్లో పర్య టించి ఓటర్లను పలుక రిస్తున్నారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో శుక్రవారం జరిగే సీఎం బహిరంగ సభను లక్ష మందితో జరపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇప్పటినుంచే జనసమీకరణ కోసం నేతలకు బాధ్యతలు అప్పగించారు.
లోక్‌సత్తా పార్టీ అధినేత.. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. సాయంత్రం కోవూరులో బహిరంగ సభ నిర్వహించారు. గురువారం మరోమారు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక సీపీఎం నేతలు, స్వతంత్రులు ఎవరికి వారుగా ప్రచారాలలో నిమగ్నమై ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అలాగే అభ్యర్థుల కుటుంబసభ్యులు, బంధువులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు.

No comments:
Post a Comment